కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

అయితే KGF chapter 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో ఇప్పుడు చూద్దాం.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 78 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, క‌ర్ణాట‌క‌లో 27 కోట్లు, త‌మిళ‌నాడులో 27 కోట్లు, కేర‌ళ‌లో 10 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 100 కోట్లు, అలాగే ఓవ‌ర్సీస్ లో 30 కోట్లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 345 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్లీన్ హిట్ సాధించాలంటే రూ. 347 కోట్ల వ‌ర‌కు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.