యువ కథానాయకుడు రానా దగ్గుబాటి(Rana Daggubati), టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విరాట పర్వం’(Virata Parvam). యువ దర్శకుడు వేణు ఊడుగుల దర్వకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి(Priyamani) ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీలోనే విడుదల కాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రానికి దాదాపు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని, ఇందులో రూ.41 కోట్లు డిజిటల్ రైట్స్ కు, రూ.9 కోట్లు శాటిలైట్ రైట్స్ కు ఇస్తామని ముందుకొచ్చినట్టు సమాచారం. మరి ఈ ఓటీటీ డీల్‌పై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి!
Recent Comment