మాస్ మహారాజ రవితేజ( RaviTeja ) వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తాజాగా రవితేజ నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’( Ramarao on Duty ) . ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత ఈ ఏడాది దసరాకు ధమాకా సినిమాలు, వచ్చే ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలను విడుదల చేయబోతున్నాడు రవితేజ.
ఇదిలాఉంటే, తాజాగా రవితేజ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోగా చేస్తున్న రవితేజ ఇక మీదట సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్టోరీ డిమాండ్ చేస్తే ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు దర్శకులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో కూడా రవితేజ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Recent Comment