బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు నేషనల్ ​స్టార్‌ ప్రభాస్‌(Prbhas). ప్రస్తుతం ఆయన చేస్తున్నవన్నీ భారీ సినిమాలే కావడం విశేషం. ఈ స్టార్‌ హీరో ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’లో నటిస్తున్నాడు. కాగా ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ (Adipurush)
సినిమాని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించారు. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు. రామాయ‌ణ గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని టీ సిరీస్‌ నిర్మిస్తోంది.

అయితే ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. కృతి సనన్(Kriti Sanon) ‘సీత’ పాత్రలో, సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ‘రావణుడి’ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఆశించిన అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురైంది. అయితే ఫస్ట్ లుక్ కు బదులుగా దర్శకుడు ఓంరౌత్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా విషయంలో అభిమానులు చేసిన కొన్ని ఫ్యాన్ మేకింగ్ ఫొటలనే ఒక వీడియోలా చేసి ఇంత ప్రేమ చూపిస్తున్న ఫ్యాన్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపాడు.

“C:\Users\krishna.mohan\Desktop\WhatsApp Video 2022-04-10 at 11.43.14 AM.mp4”