ఆర్‌ఎస్‌జే స్వరూప్‌ (Swaroop RSJ ) దర్శకత్వంలో తాప్సీ పన్ను(Taapsee Pannu) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’.(Mishan Impossible) ఎన్‌ఎం పాషా నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేక‌ర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాప్సీ లాంటి ప్రతిభ ఉన్న హీరోయిన్లతో నటించలేకపోయినందుకు తాను బాధపడుతుంటుంటానని అన్నారు. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే అసలు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అని అనిపిస్తుందని చిరంజీవి తెలిపారు. తాను రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే తాప్సి లాంటి ప్రతిభ కలిగిన కథానాయికలతో నటించే అవకాశాన్ని కోల్పోయానని పేర్కొన్నారు. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ మూవీలో తాప్సీ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాగా, దావూద్‌ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకోవాలనుకునే నేపథ్యంలో ముగ్గురు పిల్లలు, ఓ జర్నలిస్ట్‌ చేసిన పని ఏంటి అనే కథాంశంతో రూపొందిన సినిమాకి కెమెరా: దీపక్‌ యెరగరా, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌ ఎం పాషా.