పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం కెజిఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ (Salaar) సినిమాలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్ ఆద్య పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్‌రూర్ సంగీతం అందిస్తుండగా… సీనియర్ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ గ్లింప్స్‌ను ‘కేజీఎఫ్ చాప్టర్-2’ తో లింక్ చేసినట్లు సమాచారం. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఏప్రిల్14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇంటర్వెల్ సమయంలో ‘సలార్’ గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. సలార్ గ్లింప్స్ కేజీఎఫ్‌తో లింక్ చేయడం వల్ల భారీ ఎత్తున బుకింగ్స్ జరుగుతాయని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే, ఇప్పటికే వచ్చే ఏడాది వేసవి కానుకగా సలార్‌నువిడుదల చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యమైతే, మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. ఈ యాక్షన్ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
Recent Comment