రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్(Liger) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లైగర్ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా సమంత(Samantha) హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈనెల 21నే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఏప్రిల్ 23నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్‌లో జరగనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బ్లాక్ బస్టర్ ఖుషి మూవీ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషి టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో విజయ్ మిలటరీ ఆఫీసర్‌గా నటించనుండగా సమంత కాశ్మీరి అమ్మాయిగా నటించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Recent Comment