దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.

ఈ సినిమా విడుదలైన 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే తమ చిత్రాన్ని ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 16 రోజుల్లోనే 551.51 కోట్ల షేర్‌, 1003 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టింది. విడుదలకు ముందు 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం 98.51 కోట్ల లాభాలు ఆర్జించింది.