కొత్త కధలు, కొత్త నటి నటులతో, కొత్త దర్శకుల కొత్త సినిమాలు వస్తున్నాయి.  ఇది నయా ట్రెండ్.

బేబీ వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన వైష్ణవి కథానాయికగా, రౌడీ బాయ్స్ సినిమాతో హీరో గా పరిచయమైన ఆశిష్ రెడ్డి కధానాయకుడు గా వస్తోన్న చిత్రం ‘లవ్ మీ’. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి భీమవరపు అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి పి  సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ బాధ్యతను తీసుకున్నారు.  బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తో అంతర్జాతీయం గా గుర్తింపు తెచ్చుకున్న ఏం ఏం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

మేకర్స్ ఈ లవ్ మీ చిత్రాన్ని మే 25 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.