26 సంవత్సరాలు గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న ఈటీవీ ప్రాభవం తగ్గుతోందని చెప్పాలి. కొత్త తరం తో, కొత్త దనం లో పోటి పడలేక పోతోందని చెప్పాలి. మల్లెమాల వాళ్ళ షోస్ తప్ప వేరే షోస్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం మానేశారు.
ఈటీవీ అంటే ఢీ, జబర్దస్త్, కాష్ కార్యక్రమాలే అన్నట్లు గా తయారవుతోంది. ఒకప్పుడు జబర్దస్త్ రేటింగ్స్ తో పోలిస్తే ఇప్పుడు జబర్దస్త్ రేటింగ్స్ తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. మిగతా ఛానల్ వాళ్ళు ఇలాంటి షోస్ చేసి జబర్దస్త్ ను కావాలని కిల్ చేశారు. ఇప్పటికీ స్టార్ మా లో ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే కామెడీ స్టార్స్, జబర్దస్త్ లాంటిదే. అక్కడ స్కిట్ చేసే వాళ్లందరు ఈటీవీ జబర్దస్త్ లో చేసిన వాళ్ళే.
వీటికి తోడు ప్రతి పండక్కి మల్లెమాల వాళ్ళ ఒక ఈవెంట్.
ఇక సీరియల్స్ గురించి అయితే ఎంత తక్కువ గా మాట్లాడుకుంటే అంత మంచిది. 25 సంవత్సరాల ఛానెలేనా ఈ సీరియల్స్ తీసేది అనిపిస్తుంది. వీటికి తోడు, అదే ఈటీవీ న్యూస్ ప్రతి రోజు రాత్రి 9 గంటలకు. వీటికి తోడు ఈ మధ్య, మధ్యాహ్నం పూట డబ్బింగ్ సీరియల్స్ వేస్తున్నారు
ఆ వారం లో వేసినవన్ని ఆదివారం రిపీట్ చేస్తారు…. కాస్త స్వరాభిషేకం పరవాలేదనిపిస్తుంది. అది కూడా ఈ మధ్య ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు తీసేస్తారో తెలియదు.
టెలివిజన్ రంగం లో రాణించాలంటే నిన్నటి గొప్పలు చెల్లవు. ఎప్పుడు నిరంతరం కొత్తదనాన్ని అందిస్తూ ఉండాలి. ఈ రంగం అటువంటిది
TRP రేటింగ్స్ లో మూడవ స్థానం లో ఉందని సమాచారం. నాలుగవ స్థానం లో ఉన్న జెమినీ కి కొంచెం పై భాగం లో అంతే తేడా. ఈటీవీ ప్లస్ గురించి చెప్పక్కర్లేదు. ఎదో జబర్దస్త్ గురించి ఆ ఛానల్ పెట్టినట్లుంది. కొత్త సినిమాలు ప్రసారం చేయరు. చేసిన ఎప్పుడో ఒకసారి ఆది కూడా ఎవరికీ తెలియని సినిమాలు ప్రసారం చేస్తారు. దీనికి తోడు ఈటీవీ విన్ అప్ లాంచ్ చేశారు. ఈ సీరియల్స్ టీవీ లోనే చూడట్లేదంటే, అప్ లో ఎవరు చేస్తున్నారో అర్ధం కావటం లేదు
ఈటీవీ, ఈటీవీ ప్లస్ తో పోలిస్తే, ఈటీవీ సినిమా కొంచెం చూడవచ్చు. ముఖ్యం గా పెద్ద వాళ్లకు ఇందులో వచ్చే సినిమాలు నచ్చుతాయి
అయితే ఈటీవీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు, చాల మందికి జీవితాలను ఇచ్చింది. ఈ విషయం మర్చిపోకూడదు. ఈటీవీ ప్లాట్ ఫారం ఎంతోమంది భవిష్యత్తుకు పునాది వేసింది
ముందు, ముందు ఈ పోటీ ప్రపంచం లో పోటీని తట్టుకుని నిలబడుతుందా, లేదా, చతికిల బడుతుందా చూడాలి
జబర్దస్త్ తీసేస్తే ఈటీవీ లో చూడడానికి ఏముంది.! జబర్దస్త్ కూడా పూర్వ వైభవం కోల్పోయింది. ఎంత కాలం జబర్దస్త్ మీద ఆధార పడతారు.
Recent Comment