యువ హీరో నితిన్‌(Nithin) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla Niyojakavargam) ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నితిన్ సరసన కృతీశెట్టి, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్దం అయ్యారు. మాచర్ల నియోజక వర్గం చిత్రం నుండి ఫస్ట్ ఎటాక్ ను మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ రోజు సినిమాకు సంబంధించిన నితిన్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇందులో జిల్లా కలెక్టర్‌ సిద్దార్థ్ రెడ్డి పాత్రలో నితిన్‌ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకు సంగీతం మహతి స్వరసాగర్ అందిస్తున్నారు.