రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda) కథానాయకుడుగా సీనియర్ డైరెక్టర్ డైరెక్టర్ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’(Liger) సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా, స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో టైసన్‌ నటిస్తుండటంతో ఈ సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.

ఇక ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్‌ సినిమా ఆగస్ట్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. దాని కోసం పూరీ జగన్నాథ్‌ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
ఈ యంగ్ బ్యూటీ ల‌వ‌ర్స్ డే త‌ర్వాత తెలుగులో నితిన్‌తో క‌లిసి చెక్ అనే మూవీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కు పూరీ జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ సినిమాలో అవ‌కాశం ఇచ్చార‌ని స‌మాచారం. ముందుగా సీనియర్ హీరోయిన్ సమంతతో ఈ స్పెష‌ల్ సాంగ్ చేయించాల‌ని పూరీ జ‌గ‌న్నాథ్ భావించిన‌ప్ప‌టికీ అది వర్కవుట్ కాలేదు. దీంతో ఆయ‌న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.