పాన్ ఇండియా ప్రభాస్‌(Prabhas), బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో అలరించింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది.

అయితే తాజాగా రాధేశ్యామ్‌ సినిమా భారీ వసూళ్లకు సంబంధించి ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు 400 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎలా అంటే రాధేశ్యామ్‌ మూవీ థియేట్రికల్ గా ఇప్పటి వరకు 204 కోట్ల గ్రాస్ ని చేరుకోగా.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అయిన ఓటిటి అలాగే శాటిలైట్ రైట్స్ తో కలిపి 400 కోట్ల క్లబ్ లో చేరిందని చెప్తున్నారు