మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘ఆచార్య’ ట్రైలర్‌నులో ఎప్పటిలానే చిరంజీవి, రామ్‌ చరణ్‌ తమదైన నటనతో దుమ్మురేపారు. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇదిలాఉంటే, ఈ సినిమా ఓవర్సీస్ లో విడుదల కానుండగా.. ఇప్పటికే అక్కడ అన్ని పనులు పూర్తయినట్టుగా అక్కడి డిస్ట్రిబూటింగ్ సంస్థ ప్రైమ్ మీడియా ప్రకటించింది.

ఆచార్య సినిమా ప్రీమియర్స్ షో టైం అలాగే సినిమా రన్ టైంతో పాటుగా థియేటర్స్ కూడా అన్నీ కూడా లాక్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమాకు సంబందించిన బుకింగ్స్ కూడా త్వరలోనే తెరవనున్నట్టు ప్రైమ్ మీడియా వెల్లడించింది. కాగా, . ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.