సూపర్ స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాలపై దృష్టిసారించిన మహేశ్ బాబు వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా తరువాత మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా ముగిసిన తరువాత దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా మహేశ్ చేయనున్నాడు.
అయితే రాజమౌళి (SS Rajamouli) సినిమా ముగిసిన తరువాత మహేశ్ బాబు ఓ ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ చేయాలనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో(Boyapati Srinu) మహేశ్ బాబు ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుందని, తెలుస్తోంది.
Recent Comment