తమిళ స్టార్‌ హీరో విజయ్‌, టాలెంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మూవీ ‘బీస్ట్‌’. ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 13న విడుదల కానుంది. జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంది బీస్ట్‌ మూవీ.ఇటీవలే చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు అభిమానుల నుండి చక్కటి స్పందన లభించింది. అరబిక్ కుతు సాంగ్ అయితే యూట్యూబ్‌లో ఏకంగా 260 మిలియన్లకుపైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుండిఅరబిక్ కుతు తెలుగు లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. తమిళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ కంపోజ్ చేసిన ఈ పాటకు తెలుగులో శ్రీ సాయికిరణ్ లిరిక్స్ అందించారు. ఇదిలాఉంటే.. విజయ్ నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. చివరగా ఆయన నటించిన “మాస్టర్” సినిమా 6 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఆ సినిమా విడుదలైన తర్వాత దాదాపు 14 కోట్లు మేర వకలెక్షన్లు రాబట్టింది.అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తెలుగులో బీస్ట్ మూవీకి కూడా రికార్డు ధరకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. ‘బీస్ట్‌’ సినిమాకి గాను తెలుగులో 11 కోట్ల మేర ధర పలికినట్లు తెలుస్తోంది.