RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో భారీ రికార్డు.. రికార్డుల వేటకు సిద్దమైన ఎన్టీఆర్, చరణ్!
చరిత్రలో ఉన్న ఇద్దరు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు ఓ మంచి పని కోసం కలిస్తే ఎలా ఉంటుంది? అన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం)(RRR). ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(RAM CHARAN) నటిస్తున్నారు. పాన్‌ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ కు జోడిగా ఆలియా భట్(ALIA BHATT) నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటించనున్నారు. అజయ్ దేవ్‌గన్(AJAY DEVGAN) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం మార్చి 25, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ అవగా ఓవర్సీస్ లో బుకింగ్స్ ని తెరిచినప్పుడు రికార్డు స్థాయిలో బుకింగ్స్ ని ఈ చిత్రం సాధించింది. అయితే మళ్ళీ ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేయగా ఇప్పుడు అంతకు మించి ఊహించని లెవెల్లో బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ మూవీ కేవలం 4 గంటల్లోనే 2 లక్షలకి పైగా డాలర్స్ బుకింగ్స్ అయినట్టు సమాచారం. ఇది ఒక భారీ రికార్డు అని చెప్పొచ్చు.
Recent Comment