గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్ల లో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.  శుభమన్ గిల్  మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో, నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు.  హార్దిక్ పాండ్య 31 పరుగులు, డేవిడ్ మిల్లర్ 20 పరుగులు చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో ముస్తాఫిజుర్ రెహమాన్ 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

అనంతరం 172 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆది నుంచి తడపడుతూనే ఆడింది.  కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే కొంతసేపు పోరాడాడు.  రిషబ్ పంత్ 29 బంతుల్లో 43 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  లలిత్ యాదవ్ 25 పరుగులు, పావెల్ 20 పరుగులు చేసి పరవాలేదనిపించారు.   ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్ల లో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో ఫెర్గుసన్ నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని  శాసించాడు. షమి రెండు వికెట్లు తీయగా, కెప్టెన్ హార్డిక్ పాండ్య, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ :  శుభమన్ గిల్