అక్కినేని నట వారసుడు నాగ చైతన్య(Naga Chaitanya) వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో రెండు హిట్స్‌ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’, బాలీవుడ్‌ ఫస్ట్‌ మూవీ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూవీ ఆగ‌ష్టు 11న విడుదల కానుంది. ఇక అక్కినేని అఖిల్(Akhil Akkineni) న‌టిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇలా ఒక రోజు వ్యవధిలోనే నాగ‌చైత‌న్య‌, అఖిల్ సినిమాలు విడుదల కానున్నాయి. అయితే తాజాగా వీరిద్దరితో పోటీపడేందుకు స‌మంత కూడా సిద్ధమైంది. సమంత(Samantha) ముఖ్య పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ యశోద. ఈ చిత్రానికి హరి-హరీశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ఆగస్ట్ 12న విడుదల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. దీంతో నాగ‌చైత‌న్య‌, అఖిల్ సినిమాల‌తో పోటీగా స‌మంత సినిమాను విడుదల చేస్తుండ‌డం ఇండస్ట్రీలో లో హాట్ టాపిక్ గా మారింది.