బుల్లితెర యాంకర్‌ సుమ కనకాల(Anchor Suma) తాజాగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ (Jayamma Panchayathi). ఈ సినిమాకు విజయ్‌ కలివారపు దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను బలగ ప్రకాశ్‌ నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను శ‌నివారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిలీజ్ చేశారు.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఓ ప‌ల్లెటూరులో నివసించే జ‌య‌మ్మ‌ కుటుంబానికి ఓ స‌మ‌స్య ఉంటుంది. త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి జ‌య‌మ్మ ఊరి పెద్ద‌ల సమక్షంలో పంచాయితీ పెడుతుంది. అయితే ఆ సందర్భంలోనే ఊరిని కూడా ఓ స‌మ‌స్య ఎదురవుతుంది. ప‌క్కా ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు హాస్యంతో పాటుగా భావోద్వేగాలను కూడా దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు జోడించినట్లు కనిపిస్తోంది. అలాగే ఈ ట్రైలర్ కు సంగీత దర్శకుడు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పొచ్చు. మ‌రి ‘జయమ్మ పంచాయితీ’ అభిమానులను ఏ మేర‌కు అలరిస్తుందో తెలియాలంటే మే 6 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.