మాస్‌ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగాగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. (Tiger Nageswara Rao) ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా స్టార్ చిరంజీవి హాజరై ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. అలాగే టైగర్‌ నాగేశ్వరరావు మూవీ నుంచి ప్రీ లుక్‌ను కూడా చిరంజీవి విడుదల చేశారు. అయితే ఈ సినిమా ముందే చిరంజీవి ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ట‌. తొలుత దర్శకుడు వంశీ లాక్ డౌన్ సమయంలో ఈ క‌థను ప‌ట్టుకుని త‌న ద‌గ్గ‌రకు వ‌చ్చాడ‌ని చిరంజీవి వెల్లడించారు. కానీ ఇత‌ర సినిమాలతో బిజీగా ఉండడం వ‌ల్ల ఆ క‌థ‌ను అంగీకరించలేకపోయాయనని తెలిపాడు.

ఆ త‌ర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు వెళ్లడంతో వెంటనే ఆయన ఒకే చెప్పేశాడని, త‌న తమ్ముడైన ర‌వితేజ ఈ సినిమా చేయ‌డం అందంగా ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాగా, స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందబోతుంది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి జీవీప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.