దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(RAM CHARAN) కథనాయకులుగా నటించిన చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)(RRR). మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్ సంపాదించుకుంది. తొలి రెండు రోజుల్లోనే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా నాలుగో రోజు సోమవారం కూడా బాక్సఫీసు వద్ద సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ నాలుగో రోజు క‌లెక్ష‌న్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

★(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ నాలుగు రోజుల షేర్ వసూళ్లు..

★నైజాం – రూ. 8.15 కోట్లు

★సీడెడ్ – రూ. 2.92 కోట్లు

★నెల్లూరు – రూ. 0.60 కోట్లు

★గుంటూరు – రూ 0.95 కోట్లు

★కృష్ణా – రూ.10.05 కోట్లు

★పశ్చిమ గోదావరి – రూ.0.67 కోట్లు

★తూర్పు గోదావరి – రూ 0.97 కోట్లు

★ఉత్త‌రాంధ్ర – రూ. 2.26 కోట్లు

★మొత్తంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా నాలుగో రోజున రూ.17.52 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా (తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో నాలుగు రోజులకు కలిపి మొత్తం రూ. 156.21 కోట్లు (షేర్ క‌లెక్ష‌న్స్) సాధించింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ ఈవెన్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి దాదాపు రూ.215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా రూ. 156.21 కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.60 కోట్లు వసూళ్లు రాబట్టాలి