దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR). మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తూ బాక్సఫీసు దుమ్ముదులుపుతోంది. కేవలం వారం రోజల్లోనే రూ. 720 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి అరుదైన రికార్డుని నమోదు చేసింది. అయితే తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ మూవీ నుంచి ఆసక్తికర వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో “ప్రతీ తూటా మీద చచ్చే వాడి పేరుంటుంది. ప్రతీ తుపాకీ మీద పేల్చే వాడి పేరుంటుంది” అంటూ అజయ్ దేవ్ గన్ పలికిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Recent Comment