కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ మూవీలోని అర‌బిక్ కుత్తూ పాట24కోట్ల వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా లెవ‌ల్లో ఏప్రిల్ 13న విడుద‌ల కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను చిత్రబృందం రిలీజ్ చేశారు. తాజాగా చిత్ర బృందం ట్రైల‌ర్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది.
“బీస్ట్” మూవీ ట్రైల‌ర్‌ను ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్. అలాగే ట్విట్ట‌ర్లో మేమందరం కూడా మీ లాగే ‘బీస్ట్’ ట్రైల‌ర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం’ ఓ ఫోటోను విడుదల విడుద‌ల చేశారు చిత్రయూనిట్. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా, ఇప్పటికే చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, సెల్వరాఘవన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.