నాచురల్‌ స్టార్‌ నాని(Nani) హీరోగా యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’.(Ante Sundaraniki ). మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ మూవీలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది.

అలాగే ఇందులో నాని పాత్ర పేరు ‘కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్‌’. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ చేశారు మేకర్స్. ‘అంటే సుందరానికీ’ సినిమాని తెలుగు లోనే కాకుండా తమిళ, మళయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను తమిళంలో ‘అడడే సుందర’ అనే టైటిల్ తో అలాగే మళయాళంలో ‘ఆహా సుందర’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఏప్రిల్ 18న ఉదయం 11.07 నిమిషాలకి అధికారిక ప్రకటన చేయన్నునట్లు ప్రకటించారు.