మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్‌(God Father) అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ల‌పై కీలక స‌న్నివేశాలు తెరకెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

ఇదిలావుంటే.. ‘గాడ్ ఫాదర్’ మూవీలో న‌టించే ముందు చిరంజీవికి స‌ల్మాన్ ఖాన్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో న‌టించ‌డానికి ఎంత పారితోషికం కావాలంటూ స‌ల్మాన్ ఖాన్‌ని చిరంజీవి అడగ్గా… చిరుతో ఉన్న స్నేహ బంధం కారణంగా స‌ల్మాన్ ఖాన్‌ ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పారట. ఈ విషయంలో తనను ఫోర్స్ చేస్తే ఈ మూవీ నుంచి త‌ప్పుకుంటాన‌ని చిరంజీవికి గట్టిగా చెప్పేశారట సల్మాన్ ఖాన్. కాగా, ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం.