పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు'(Hari hara Viramallu). ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్​ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్​గా నిధి అగర్వాల్​ నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 20 నుంచి జరుగనున్న షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ మీద ఓ పాటను చిత్రీకరించబోతున్నారట.

ఇందులో పవర్ స్టార్ రోల్ ను ఎలివేట్ చేస్తూ షూట్ చేయనున్నట్టు సమాచారం. ఇక సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే ఓ భారీ సెట్‌ను కూడా వేశారని తెలుస్తోంది. పవన్‌పై కళ్యాణ్ పై చిత్రీకరించనున్నఈ సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు. ఈ వార్త విన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, రూ. 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్​ ముద్దుగుమ్మ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​​ నటించనున్నట్లు సమాచారం. కాగా, మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ 5 భాషల్లో విడుదల కానుంది.