తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్(Bigg Boss ) కొత్త సీజన్ వచ్చేసింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ఓటిటికి వెర్షన్(Bigg Boss OTT Telugu ) హాట్ స్టార్ లో(Hot Star ) ప్రసారం కాబోతుంది .ఏ సీజన్ లో 18 మంది పాల్గొనబోతున్నారు .ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ చాలా రిచ్ గా, అందంగా ఉంది .ఇక హౌస్ లోకి రాబోతున్న 18 మంది కంటెస్టెంట్స్ లో సగం మంది గత సీజన్లో వచ్చిన పాత కంటెస్టెంట్స్ అలాగే సగం మంది కొత్తగా రాబోయే కంటెస్టెంట్స్.

వీళ్ళతో సరి కొత్తగా గేమ్ ఆడించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్(Bigg Boss OTT ). ఈ రోజు నుండి 24 గంటలు ప్రసారం అవుతూ దాదాపు వంద రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం. మరి ఈరోజు నుండి స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.గత మూడు సీజన్స్ హోస్ట్ చేసిన కింగ్ నాగార్జున (Nagarjuna )గారు ఈ సీజన్ ని కూడా హోస్ట్ చేయబోతున్నారు.