బిగ్బాస్ (Bigg Boss Telugu )అభిమానులు ఎదురు చూస్తున్న ఓటిటి రియాల్టీ షో బిగ్ బాస్ మొదటి సీజన్ వచ్చేసింది .కింగ్ నాగార్జున (Nagarjuna )తనదైన స్టైల్లో బిగ్ బాస్ ని ప్రారంభించారు. అదిరిపోయే స్టెప్పులతో నాగార్జున(Nagarjuna) గ్రాండ్ గా షోనీ ప్రారంభించగా మొదటి కంటెస్టెంట్ గా అశు రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. అలాగే రెండవ కంటెస్టెంట్ గా మహేష్ విట్టా(Mahesh Vitta ) ఎంట్రీ ఇచ్చాడు.

మహేష్ విట్టా ,నాగార్జున (Nagarjuna )హోస్ట్ చేసిన సీజన్ త్రీ లో బిగ్ బాస్ లోకి వచ్చి తనదైన శైలిలో అలరించారు. ఇప్పుడు మళ్ళీ 24 గంటలు ప్రసారమయ్యే బిగ్ బాస్ హౌస్(Bigg Boss OTT ) లోకి రావడం ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఇక మూడవ సీజన్లో టాప్ 5లోకి రాలేకపోయినా మహేష్ విట్టా(Mahesh vitta ) బిగ్ బాస్ లో మాత్రం చివరి వరకు ఉంటానని మహేష్ తెలిపారు. మహేష్ విట్టా బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.