తెలుగు బిగ్ బాస్ ఓటిటి (Bigg Boss OTT )మొదటి వెర్షన్ లో నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది .గత సీజన్లో వచ్చిన సీనియర్స్ నీ మాత్రమే నామినేట్ చేయాలని బిగ్బాస్ తెలపడంతో వారియర్స్ టీమ్ లో ఉన్న ఇంటి సభ్యులను నామినేట్ చేశారు. ఈ క్రమంలో నాలుగో సీజన్ లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్ధక్ (Akhil Sarthak )మొదటి వారం నామినేట్ అయ్యారు. అఖిల్ కారణంగా గేమ్ ఆగిపోయిందనే కారణంతో అతని నామినేట్ చేసింది బిందుమాధవి.

గత సీజన్లో వచ్చిన వారుయర్స్ టీమ్ లో ఉన్న ఇంటి సభ్యులను తగిన కారణాలు చెప్పి వాళ్ళకి ఇచ్చిన ట్యాగ్స్ వాళ్ల మెడలో వేసి నామినేట్ చేయాలని బిగ్బాస్ (Bigg Boss OTT )తెలపడంతో బిందు మాధవితో(Bindu madhavi ) పాటు మరికొందరు అఖిల్ ని (Akhil )నామినేట్ చేశారు.ఓటిటిలో మొదటి వారమే అఖిల్ నామినేట్ అయ్యాడు. మరి అఖిల్ (Akhil ) ఓట్లు సంపాదించి సేఫ్ అవుతాడా లేదా మొదటి వారం ఎలిమినేట్ అవుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.