Bigg Boss OTT Telugu: మరికాసేపట్లో బిగ్‌బాస్‌ ఓటీటీ.. భారీ మార్పులతో కంటెస్టెంట్ల ఫైనల్‌ లిస్ట్‌!

బిగ్‌బాస్‌(Bigg Boss) అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ షో ఇప్పుడు ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు ముస్తాబైంది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ (Bigg Boss OTT Telugu) పేరుతో ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది. అంతా అనుకున్నట్టే ఈ షోకు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా ఉండనున్నారు.

ఈ మెగా షోలో పాల్గొననున్న 17 మంది కంటెస్టెంట్లు ఇప్పటికే క్వారంటైన్‌ పూర్తి చేసుకొని మరికాసేపట్లో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ సీజన్‌లో పాల్గొననున్న కంటెస్టెంట్లలో ఆదర్శ్‌( సీజన్-1), తనీష్‌(సీజన్-2)లు ఉంటారని వార్తలు వినిపించినా ఇందులో వాళ్లు పాల్గొనట్లేదని తెలుస్తోంది.

ఇక బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లే..

1. ముమైత్‌ ఖాన్‌ (సీజన్ 1 కంటెస్టెంట్)
2. హమీదా (సీజన్ 5 కంటెస్టెంట్)
3. నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్ 5 కంటెస్టెంట్)
4. నిఖిల్‌
5. మిత్రా శర్మ(నిర్మాత)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2 కంటెస్టెంట్)
7. మహేష్‌ విట్టా (సీజన్ 4 కంటెస్టెంట్)
8. శ్రీ రాపాక
9. బిందు మాదవి
10. అజయ్‌ కతుర్వార్‌
11. అషు రెడ్డి (సీజన్ 3 కంటెస్టెంట్)
12. అరియానా (సీజన్ 4 కంటెస్టెంట్)
13. యాంకర్‌ శివ
14. అఖిల్‌ సార్థక్‌
15. సరయు
16. ఆర్జే చైతు
17. అనిల్‌ రాథోడ్‌ (మోడల్)