బిగ్బాస్ (Bigg Boss OTT ) అభిమానులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ వచ్చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు కింగ్ నాగార్జున (Nagarjuna )గ్రాండ్ గా షోని ప్రారంభించారు. ఇక అదిరిపోయే సాంగ్స్ కి మాస్ స్టెప్పులుతో అదరగొట్టిన నాగార్జున, బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరగేశాడు. ఈ క్రమంలో ఓటిటి బిగ్ బాస్ లో మొదటి కంటెస్టెంట్ నో పరిచయం చేసాడు నాగార్జున .ఇక బిగ్ బాస్ ఓటిటిలో మొదటి కంటెస్టెంట్ గా అశు రెడ్డి (Ashu Reddy ) ఎంట్రీ ఇచ్చింది. ఈమె నాగార్జు హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ఓటిటి బిగ్ బాస్ లో మొదటి కంటెస్టెంట్ గా ఉ అంటావా మామ ఉయూ అంటావా మామా అనే సాంగ్ తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది .గత బిగ్ బాస్ (Bigg Boss OTT )లో త్వరగా వెళ్లి పోయిన ఈ భామ ఓటిటి బిగ్ బాస్ లో చివరి వరకు ఉండే దానికి గట్టిగా ప్రయత్నిస్తానని, గేమ్ ని కూడా అదే స్థాయిలో ఆడతానని తెలిపింది .సోషల్ మీడియాలో వచ్చినట్టుగానే గత సీజన్లో వచ్చిన అశు రెడ్డి (Ashu Reddy )మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.