మహేష్ బాబు (Mahesh babu )నుండి సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత వస్తున్న లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట(Sarkaaru vaari paata ) .ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన కళావతి(Kalavathi ) అనే సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరో సాంగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు సంగీత దర్శకుడు తమన్(S Thaman ). సర్కారు వారి పాట నుండి అదిరిపోయే మాస్ సాంగ్ కి రెడీగా ఉండండి అంటూ అభిమానులకి హింట్ ఇచ్చాడు.

కళావతి సాంగ్(Kalavathi Song ) దాదాపు 40 మిలియన్ వ్యూస్ దక్కించుకుని మహేష్ బాబు(Mahesh babu ) కెరీర్ లో నెంబర్ వన్ సాంగ్ నిలవగా ఇప్పుడు విడుదల చేసే రెండవ సాంగ్ అంతకుమించి హిట్ అయ్యేలా కష్టపడుతున్నాం అంటూ తెలిపాడు. దాంతో ఈ పాట మీద అంచనాలు పెరిగిపోయాయి .ఇక పోకిరి సినిమా తర్వాత అలాంటి హెయిర్ స్టైల్ తో మళ్లీ మహేష్ బాబు ఈ సినిమాలో గ్లామర్ గా కనిపిస్తున్నారు.

సర్కారు వారి పాట(Sarkaaru vaari paata ) మే 12న భారీ స్థాయిలో విడుదల కానుంది. పరుశురామ్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ gmb entertainment వారు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.