Telugu Indian Idol :
రికార్డుల్ని బద్దలుకొట్టిన “తెలుగు ఇండియన్ ఐడల్”

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ “ఆహా”(Aha) సరికొత్త కాన్సెప్ట్స్‌తో గత కొంతకాలంగా ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే తొలుత టాలివుడ్ అగ్రకథానాయిక సమంతతో ‘సామ్‌ జామ్‌’, అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్‌’ వంటి కార్యక్రమాలతో ఆహా ప్రేక్షకులకు అలరించింది. తాజాగా తెలుగు ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ (Telugu Indian Idol )
పేరుతో నూతన గాయకులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు రియాలిటీ షోను ముందుకు తీసుకొచ్చింది. ఈ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ తొలి ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది.

కాగా, ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ తొలి ఎపిసోడ్ అత్యధిక రేటింగ్స్‌ సాధించింది. రియాలిటీ షో లాంచ్‌లు సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ సీజన్‌ ఒక సంచలనంతో మొదలైంది. ఇక ఈ పాపులర్ సింగింగ్ షోకు హోస్ట్‌గా ప్రముఖ సింగర్‌, శ్రీరామ చంద్ర హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకు శ్రీరామచంద‍్ర 2013లో ఇండియన్‌ ఐడల్‌గా (హిందీ) విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ షోకు న్యాయ నిర్ణేతలుగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్‌, స్టార్ హీరోయిన్ నిత్యా
మీనన్, పాపులర్ కార్తిక్ వ్యవహరిస్తున్నారు.