టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ రాజా రవితేజ ( Ravi teja ).ఇటీవల ఖిలాడీ(Khiladi ) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు మరో మూవీతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.రవితేజ(Ravi teja ) నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ(Ramaroa on duty ) ఒకటి.ఈ చిత్రంలో రవితేజ ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు మార్చి 1న శివరాత్రి సందర్భంగా రామారావు ఆన్ డ్యూటీ నుండి మొదటి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ విడుదల చేసింది మూవీ టీం. ఈ పోస్టర్ లో రవితేజ(Ravi teja ) ఒక వ్యక్తిని కాలితో తన్నుతూ కనిపించాడు .ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక మాస్ యాక్షన్ ఫైట్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి శరత్ మండవ (Sharath mandava )దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ చెరుకూరి (Sudhakar Mandava )నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .మరి ఖిలాడితో అంతగా ఆకట్టుకొని రవితేజ శివరాత్రికి వస్తున్న టీజర్ తో రామారావు ఆన్ డ్యూటీ మీద అంచనాలు పెంచుతాడేమో చూడాలి మరి
Recent Comment