బిగ్ బాస్ హౌస్ (Bigg Boss OTT ) లో మొదటి నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది.ఈసారి భిన్నంగా నామినేషన్ ను ఏర్పాటు చేశారు బిగ్బాస్. హౌస్ మెట్స్ ని వారియర్స్, చాలెంజర్స్ అంటూ రెండు విభాగాలుగా చేసిన బిగ్ బాస్(bigg Boss ) మొదటి వారం చాలెంజర్స్ కి నామినేషన్స్ లో లేకుండా మినహాయింపు ఇచ్చారు .దాంతో మొదటి వారం పాత సీజన్స్ కంటెస్టెంట్స్ అయిన వారియర్స్ నామినేషన్ లో నిలబడాల్సి వచ్చింది .ఈ క్రమంలో చాలెంజర్స్ టీమ్ లో ఉన్న సభ్యులు అక్కడ ఉన్న ట్యాగ్స్ తీసుకుని వారియర్స్ ఇంటి సభ్యులను నామినేట్ చెయ్యాలి.

తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని తెలిపారు. ఈ క్రమంలో ముమైత్ ఖాన్(Mumaith Khan ) బిగ్ బాస్ మొదటి వారం నామినేట్ అయింది. ఆమె అందరితో కోపంగా మాట్లాడుతుందని, హౌస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది అంటూ ఆమెను నామినేట్ చేశారు. దాంతో మొదటి వారమే ఎలిమినేషన్ జోన్ లోకి అడుగుపెట్టింది ముమైత్ ఖాన్(Mumaith kahan ). మరి ఆడియన్స్ దగ్గరనుండి ఆమెన్ ఓట్లు సంపాదించి బిగ్బాస్ ఓటిటిలో(Bigg Boss OTT ) కొనసాగుతుందా లేదా హౌస్ నుండి బయటకు వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.