తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది బిగ్ బాస్ షో (Bigg Boss ).తమిళ్ బిగ్ బాస్ కి స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal hasan )హోస్ట్ గా చేస్తున్నాడు. గత ఐదు సీజన్స్ గా తమిళ్ బిగ్ బాస్ కి కమల్ హోస్ట్ గా వచ్చాడు. ఇక కొత్తగా అల్టిమేట్ బిగ్ బాస్ (Bigg Boss Ultimate)అంటూ ఓటిటిలో స్టార్ట్ అయ్యింది బిగ్ బాస్.మొదట్లో దీనికి కూడా కమల్ హాసన్ హోస్ట్ చేశారు. కానీ ఇపుడు ఈ షోకి మరో కొత్త హోస్ట్ వచ్చాడు.

తమిళ స్టార్ హీరో శింబుని(Simbu ) కొత్త హోస్ట్ గా సెలెక్ట్ చేశారు.కమల్ హాసన్ (Kamal hassan )కి మూవీ షూటింగ్ ఎక్కువ ఉండడంతో ఆయన తప్పుకున్నాడు. దాంతో ఆయన ప్లేస్ లో శింబుని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శింబు ప్రోమోని విడుదల చేసారు. ఓటిటి లో వస్తున్న బిగ్ బాస్(Bigg Boss ultimate ) అల్టిమేట్ కి శింబు హోస్ట్ చేస్తున్నాడు.