టీమిండియా (India )సీనియర్ క్రికెటర్ మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj )రిటైర్ కాబోతోంది. 23 ఏళ్ల నుండి భారత్ కి సేవలు అందిస్తోంది మిథాలి రాజ్.ఇక వచ్చే వన్డే వరల్డ్ కప్(ODI world cup ) తరువాత క్రికెట్‌ నుండి రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించింది.మిథాలి(Mithali Raj ) 23 ఏళ్ల నుండి భారత మహిళా టీమ్ కి ఆడుతోంది. టీమిండియాకి సారధిగా ఎన్నో విజయాలు సాధించింది. 2005లో భారత జట్టుకు కెప్టెన్ అయ్యింది.నెంబర్ వన్ బ్యాటర్ గా మిథాలి అనేక రికార్స్డ్ క్రియేట్ చేసింది.

మిథాలి రాజ్(Mithali Raj ) కెప్టెన్సీ లో భారత మహిళల జట్టు రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కి వెళ్ళింది.2005, 2017 వన్డే వరల్డ్ కప్స్ లో ఫైనల్‌కు చేర్చింది.కానీ బ్యాడ్ లాక్ తో టైటిల్ గెలిపించలేకపోయింది. ఇక తన ఆఖరి వన్డే ప్రపంచ కప్(Cricket ) కోసం సిద్ధం అవుతున్న మిథాలి ఆ తరువాత క్రికెట్ కి గుడ్ బై చెప్పనుంది.