2022 ఐపీల్ (IPL )సీజన్ స్టార్టింగ్ తేదీలను ప్రకటించింది బిసిసిఐ. మార్చి 26 నుండి 2022 ఐపీల్ సీజన్ మ్యాచ్‌లు మొదలు కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్(Brijesh patel ) తెలియచేసారు.మొదట మార్చి 27 నుండి ఐపీఎల్‌ని స్టార్ట్ చెయ్యాలని బిసిసిఐ(BCCI ) అనుకుంది.కానీ స్టార్‌ స్పోర్ట్స్ మార్చి 26 నుండే టోర్నీ మొదలు పెట్టాలని కోరడంతో ఐపీఎల్ మేనేజ్మెంట్ ఒకే చెప్పింది.ఇక ఈ సంవత్సరం ఐపీఎల్(IPL 2022 ) మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే జరుగుతాయి.

అన్ని మ్యాచ్ లు మహారాష్ట్రలోనే జరుగుతాయి.ముంబయిలో వాంఖడే, డీవై పాటిట్, బ్రబోర్న్ స్టేడియాల్లో ఈ మ్యాచెస్ సాగుతాయి. ఈ మూడు స్టేడియాల్లో 55 మ్యాచ్‌లు అలాగే పుణెలోని(Pune ) ఎంసీఏ స్టేడియంలో 15 మ్యాచ్ లు జరుగుతాయి. 10 జట్లతో మొత్తం 70 మ్యాచ్ ను ఈసారి ఐపీల్ లో(IPl ) నిర్వహిస్తారు.మే 29న ఫైనల్ జరగనుంది.