2022 ఐపీఎల్ (IPL )మార్చిలో ప్రారంభం కానుంది. కానీ ఇపుడు ప్రాంఛైజీలుకు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ లో ఆస్ట్రేలియా (Australia )క్రికెటర్లు దూరం కాబోతున్నారు. మార్చి నెలలో ఆస్ట్రేలియా పాకిస్తాన్ తో పరిమిత ఓవర్ల సిరీస్ అలాగే టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మార్చ్ 4 నుండి ఏప్రిల్ 5వరకు జరగనుంది. ఇక ఐపీల్(IPl ) మార్చ్ 27 నుండి స్టార్ట్ కాబోతోంది.దాంతో ఐపీల్ లోని కొన్ని మ్యాచ్ లకు ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరంగా కానున్నారు.

డేవిడ్ వార్నర్(Devid Warner ), మిచెల్ మార్ష్, స్టాయినీస్, కమిన్స్, హాజల్‌వుడ్‌ మిచెల్‌ స్టార్క్‌ వంటి ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లకు దూరం కానున్నారు.మెగా వేలంలో ఆస్ట్రేలియా (Australia )ఆటగాళ్లను కోట్లు పెట్టి కొనుకున్నారు. కానీ ఇపుడు వాళ్ళు కొన్ని మ్యాచ్ లకు దూరం కావడం ఆయా టీమ్స్ కి నష్టం అని చెప్పలి.