ప్రభాస్ (Prabhas )పాన్ వరల్డ్ చిత్రం ప్రాజెక్ట్ కె(Project k ). ఇటీవల స్టార్ట్ అయిన ఈ మూవీ హైదరాబాద్ (Hyderabad )లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్(Prabhas ), దీపికా పదుకొనె(Deepika padukone ) ,అమితాబ్ బచ్చన్(Amitab bachhan ) షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీలో విలన్ కోసం ఒక విలక్షణ నటుడిని తీసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్(nag ashwin ) చూస్తున్నాడట.

ఈ సినిమాలో విలన్ పాత్రకి అధిక ప్రాధాన్యత ఉండడటంతో తమిళ నటుడు sj సూర్యని(SJ Surya ) తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ లో sj సూర్య విలన్ గా ఆకట్టుకున్నాడు. మహేష్ బాబు స్పైడర్ లో కూడా విలన్ గా మెప్పించాడు. మరి ప్రభాస్ కి (Prabhas )విలన్ గా sj సూర్య కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి. ప్రాజెక్టు కె తరువాత సలార్,ఆది పురుష్, స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.