2022 IPL వేలం లో క్రికెటర్స్ మీద కనక వర్షం కురుస్తోంది. పామ్ లో ఉన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడి మరియు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇక ఈ రోజు కూడా ఒక క్రికెటర్ అత్యధిక ధర పలికాడు. లియమ్ లివింగ్ స్టోన్ కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చెన్నై, కలకత్తా, గుజరాత్ ,పంజాబీ, టీమ్స్ ఈ బ్యాటర్ కోసం పోటీ పడగా చివరికి పంజాబ్ అతని దక్కించుకుంది.ఇతని కోసం ఏకంగా 11.5 కోట్లు ఖర్చు చేసింది పంజాబ్ .ఈ ప్లేయర్ కోసం మొదటగా కలకత్తా వేలంలోకి వచ్చినప్పటికీ తర్వాత చెన్నై ,పంజాబ్, గుజరాత్ ,పోటీ పడడంతో కలకత్తా డ్రాప్ అయ్యింది. కానీ పంజాబ్ మాత్రం అతని కోసం చివరి వరకు పోరాడి 11.5 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర కోటి రూపాయలతో వేలం లోకి వచ్చిన లివింగ్ స్టోన్ 11.5 కోట్లు పలకడం విశేషం అని చెప్పాలి .పామ్ లో ఉంటే లివింగ్ స్టోన్ భారీ స్కోర్ చేయడంలో దిట్ట .అందుకే పంజాబ్ కోసం అత్యధిక ధరను పెట్టి మరీ కొనుక్కుంది. మరి భారీ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ ipl చరిత్రలో పంజాబ్ కి ఆశించిన స్థాయిలో విజయాలు లేవు. మరి ఈసారైనా పంజాబ్ టీం ఐపీఎల్ లో తన సత్తా చాటుతుందేమో చూడాలి.