పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan )ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భీంలా నాయక్ (Bheemla Nayak )వచ్చేసింది .ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఫిబ్రవరి 25 శుక్రవారం రోజు గ్రాండ్ గా విడుదలైంది. సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్(Pawan kalyan ) ,రానా(Rana = ఇద్దరూ కలిసి నటించిన భీంలా నాయక్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందా.
కథ :
భీంలా నాయక్(పవన్ కళ్యాణ్ )(Pawan kalyan ) ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్. న్యాయం కోసం ఎవరైనా కూడా ఎదిరించే నైజం భీంలా నాయక్ ది . ఇక అదే ఊర్లో ఒక డాన్ గా డానియల్ శేఖర్(రానా )(Rana ) ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తుంటారు. అది తెలుసుకున్న ఎస్ఐ భీంలా నాయక్ ,డేనియల్ ని ఎదిరిస్తాడు .అంతే కాకుండా డేనియల్ శేఖర్ ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు .దాంతో డానియల్ శేఖర్ ఈగో దెబ్బతిని నాయక్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఈ నేపథ్యంలో అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే కథే భీంలా నాయక్. ఇక ఈ ఈగో దెబ్బతిన్న శేఖర్ ,భీంలా నాయక్ ని ఏం చేశాడు? దానికి పవన్ కళ్యాణ్ ఎలా ప్రతిఘటించాడు? అన్నది వెండి తెర మీద చూడాల్సిందే.
తక్కువ సినిమాలు చేసినప్పటికీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర అభిమానులకు కావలసిన రీతిలో భీంలా నాయక్ ని తీర్చిదిద్దాడు. ఇక మరో ప్లస్ పాయింట్ త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ పవన్ కళ్యాణ్ కి ,రానాకీ ఇద్దరికీ సమానంగా డైలాగ్స్ రాసారు.త్రివిక్రమ్(Trivikram ) డైలాగ్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకుల నుండి ఒక రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అదరగొట్టేసారు .ఆయన మ్యానరిజం ,భీంలా నాయక్ పాత్రలో చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకి మరో హైలెట్ రానా పాత్ర .ఈ పాత్రని అద్భుతంగా పోషించాడు రానా. పవన్ తో పోటీపడి మరీ నటించాడు .ఈ పాత్ర రానా కెరీర్ లో మరుపురాని పాత్రగా ఉండిపోతుంది .ఇక సముద్రకని(Samudra khani ) ,నిత్యా మీనన్(Nithya meenon ) ,సంయుక్త మీనన్ వారి పాత్రలను బాగానే పోషించారు .
ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తమన్ (S thaman )అందించిన పాటలు అలాగే నేపధ్య సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా భీంలా నాయక్ ( bheemla nayak )ఆకట్టుకుంటాడు. పవన్ కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అవకాశాలున్నాయి.
రేటింగ్: 3.5/5
Recent Comment