Aadavallu Meeku Joharlu Review: ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ రివ్యూ
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన, ఖష్బూ, రాధిక, ఊర్వశిలు తదితరులు
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : కిషోర్ తిరుమల
సంగీతం : దేవిశ్రీప్రసాద్
శర్వానంద్(Sharwanand), రష్మిక మందన్నా(Rashmika Mandanna), జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu Meeku Joharlu) దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్(Sri Lakshmi Venkateswara Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ క్రమంలో ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఒక ఊర్లో చిరంజీవి {శర్వానంద్) వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కారణంగా పెళ్లి కాకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలోనే ఆద్య(రష్మీక మందన్న)ను చూసి ప్రేమలో పడిన చిరంజీవి ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ ఆద్య మాత్రం అందుకు ఒప్పుకోదు. తన తల్లి వకుల(ఖుష్బూ)కి వివాహం ఇష్టం లేదు అని చెప్తుంది. అసలు వకులకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు ? ఆధ్య కుటుంబాన్ని ఒప్పించడానికి చిరంజీవి ఏం చేశాడు ? ఆఖరి చిరంజీవి – ఆద్య పెళ్లి జరిగిందా అనేదే మిగతా చిత్ర కథ.
విశ్లేషణ:
వివాహబంధం అంటేనే నచ్చని ఒక కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇందులో చిరంజీవి పాత్రలోశర్వానంద్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా నడిపించాడు. ముఖ్యముగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వానంద్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మీక మందన్న తననటనతో అదరగొట్టింది. అలాగే కీలక పాత్రలో నటించిన ఊర్వశి కూడా ఆకట్టుకుంది. అయితే సినిమాలో కొన్ని చోట్ల కామెడీ బాగానే పండినా.. కథనం మాత్రం ఆసక్తిగా సాగలేదు. దర్శకుడు తీసుకున్న కథ బాగున్నప్పటికీ.. కథనం అలాగే సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సీన్స్ ఈ మూవీకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను రాసుకున్న కథను ను స్క్రీన్ మీద సరిగ్గా చెప్పలేకపోయాడు. మొత్తంగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రం మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
శర్వానంద్, రష్మిక , ఖష్బూ, రాధిక , ఊర్వశి నటన
కథ, కథనం
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
కథనం
సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు
రేటింగ్: 3/5
Recent Comment