టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )మరో రికార్డ్ క్రియేట్ చేసాడు. శ్రీలంకతో జరిగిన టీ20(Ind vs Sl T20) లో రోహిత్ 44 పరుగులు చేసాడు.ఇక ఈ మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ టీ20ల్లో మ్యాచ్ ల్లో హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ గా వరల్డ్ రికార్డు నమోదు చేసాడు.ఈ మ్యాచ్ తో టీ20ల్లో 3300 పరుగులు కంప్లీట్ చేసాడు రోహిత్.ఇప్పటి వరకు టీ20 ల్లో హైయెస్ట్ రన్స్ రికార్డ్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన గప్తిల్ (Martin Guptil )పేరు మీద ఉండేది. గప్తిల్ 3299 పరుగులు చేసాడు.

ఇపుడు ఆ రికార్డ్ ని రోహిత్ (Rohit Sharma )బ‌ద్ధ‌లు కొట్టాడు.ఇక రోహిత్ కెప్టెన్సీ లో భారత్ వరుస విజయాలు సాధిస్తోంది. ఇక శ్రీలంక(Ind vs Sl T20 ) మీద అద్భుత విజయం సాధించింది.ఇక ఇప్పటి వరకు 123 అంతర్జాతీయ టీ20లు ఆడిన రోహిత్ శర్మ 3307 ప‌రుగులు చేశాడు.టీ20ల్లో రోహిత్ 26 హాఫ్ సెంచ‌రీలు ,4 సెంచురీలు కొట్టాడు.