తమిళ కథానాయకుడు అజిత్ (Ajith ), హెచ్. వినోద్(H .Vinodh ) దర్శకత్వంలో నటించిన వలీమై(Valimai ) సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.ఇక పిబ్రవరి 24న తెలుగు ,తమిళ్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
వలీమై సినిమా(Valiamai Review ) కథ విషయానికి వస్తే డ్రగ్స్ కి అలవాటు పడిన యువత,డబ్బులు లేని పరిస్థితుల్లో బైకర్ గ్యాంగ్ తో చేరి చైన్ స్నాచింగ్స్ ,హత్యలు ,దొంగతనలకు అలవాటుపడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఈనేపథ్యంలో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిన ఈ గ్యాంగ్ ని పట్టుకునే బాధ్యత హీరో అజిత్ కి(Ajith) అప్పగిస్తారు. దొంగలను పట్టునే నేపథ్యంలో హీరోకి ఎదురయ్యే సమస్యలు ఎంటి అనేవి తెరపై చూడాలి.
ఇక సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు త్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. అజిత్ ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి.ఇక కార్తికేయ(Karthikeya ) క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక సాధారణ విలన్ గానే కనిపించాడు .ఫస్ట్ హాఫ్ సినిమా త్రిలింగ్ అండ్ యాక్షన్ సీన్స్ తో చాలా ఉత్కంఠగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయ్యింది.మాస్ ప్రేక్షకులకు, యాక్షణ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
Recent Comment