నటీనటులు : యశ్, సంజయ్‌ దత్, రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి, రావు రమేశ్‌ త‌దిత‌రులు
నిర్మాతలు : విజయ్‌ కిరగందూర్
దర్శకత్వం : ప్రశాంత్‌ నీల్‌
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ

కన్నడ అగ్రకథానాయకుడు యశ్‌(Yash) ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) 2018లో బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కేజీఎఫ్‌ 2 మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. గరుడను చంపిన రాఖీ భాయ్ కేజీఎఫ్ ను ఎలా దక్కించుకున్నాడు ? దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను ఎలా ముగించాడు వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

కేజీఎఫ్‌ (న‌రాచీ)లో గరుడని చంపేసి రాఖీ భాయ్ (యశ్) కెజిఎఫ్ మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత కథగా కేజీఎఫ్‌-2 మొదలవుతుంది. అక్క‌డి ప్ర‌జ‌ల‌కి ప్రత్యేక్ష దైవంగా మార‌తాడు రాఖీ భాయ్. వీళ్లంతా కలిసి బంగారు నిక్షేపాల్ని వెలికి తీసి దాంతో వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలోనే అధీరా (సంజ‌య్‌ద‌త్‌) కేజీయఫ్‌ను త‌న వశం చేసుకునేందుకు సైన్యంతో బరిలోకి దిగుతాడు. అలాగే కేజీయఫ్ గురించి తెలుసుకున్న ప్ర‌ధాన‌మంత్రి ర‌మికాసేన్ (ర‌వీనాటండ‌న్‌) రాఖీ భాయ్ ని మట్టుబెట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు అధీరాతోనూ అటు ప్రభుత్వంతోను రాఖీభాయ్ పోరాటం ఎలా చేశాడు అనేదే మిగ‌తా చిత్ర క‌థ‌.

విశ్లేషణ:

కేజీఎఫ్‌ సినిమా తరహాలోనే కేజీఎఫ్‌- 2లో కూడా కథానాయకుడు యశ్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ సినిమాలో యశ్ స్టైలిష్ నటనకు ఆయన పలికిన డైలాగ్స్ కు సినీప్రపంచం జేజేలు పలుకుతోంది. కొన్నిచోట్ల భావోద్వేగాల్ని యశ్ తీరు కూడా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ రీనా (శ్రీనిధి శెట్టి) పాత్ర‌ కూడా అలరించింది. సెకండాఫ్ లో ఆమె పాత్ర చ‌క్క‌టి భావోద్వేగాలు పలికించింది. ఇక సంజ‌య్‌ద‌త్ అధీరాగా క‌నిపించిన తీరు బాగుంది. అలాగే శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తమ తమ పాత్రలకు చక్కటి న్యాయం చేశారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి వారెవ్వా అనిపించాడు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ అన్ని కలిపి కూడా కేజీఎఫ్‌ ని మించి చూపించాడు. కాకపోతే కొన్ని చోట్ల కథనం గందరగోళంగా అనిపిస్తుంది. ఇక రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు. అలాగే భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం అద్భుతం అని చెప్పొచ్చు. కేజీఎఫ్‌- 2 సినిమా నిర్మాణ విలువ‌లు గొప్పగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
యశ్ హీరోయిజం
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌:
గందరగోళంగా సాగే కథనం

రేటింగ్: 7/10