Upcoming Movies, Web Series In OTT: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే!

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణ తగ్గడంతో దేశవ్యాప్తంగా వరుసగా చిన్నా ,పెద్దా సినిమాలు(Movies), వెబ్‌ సిరీస్‌( Web Series)లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు థియేటర్‌లో దుమ్మురేపుతుండగా మరికొన్ని ఓటీటీలో అదరగొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మార్చి నెల మొదటి వారంలో కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ( OTT)లో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేవో ఇప్పుడు చూద్దాం…

మార్చి నెల మొదటి వారంలో ఓటీటీలో వస్తున్న వెబ్‌ సిరీస్‌, సినిమాలివే..

► ఆహా

* డీజే టిల్లు – మార్చి 4 – ( మార్చి 4న రిలీజ్)

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం డీజే టిల్లు. ఫిబ్రవరి12న రిలీజ్‌ అయిన ఈ మూవీ హిట్‌టాక్‌ సాధించింది. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావడంతో దీనికి సీక్వెల్‌ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది ‘ఆహా’ వేదికగా మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ రానుంది.

► డిస్ని + హాట్‌స్టార్‌

* బెటర్‌ థింగ్స్‌ 5వ సీజన్‌ – (మార్చి 1న రిలీజ్)
* సుత్‌ లియాన్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌)- (మార్చి 4న రిలీజ్)
* రుద్ర- ద ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ ( హిందీ వెబ్‌ సిరీస్‌) – (మార్చి 4న రిలీజ్)

►అమెజాన్‌ ప్రైమ్‌
* ద బాయ్స్‌ ప్రజెంట్స్‌: డయాబాలికల్‌ – (మార్చి 4న రిలీజ్)
* నో టైమ్‌ టు డై – (మార్చి 4న రిలీజ్)

►జీ 5
* సామాన్యుడు- (మార్చి 4న రిలీజ్)

►నెట్‌ఫ్లిక్స్‌
* ఎగైన్స్‌ ద ఐస్‌ -హాలీవుడ్ (మార్చి 2న రిలీజ్)
* ద వీకెండ్‌ ఎ వే -హాలీవుడ్ (మార్చి 3న రిలీజ్)
* పీసెస్‌ ఆఫ్‌ హర్‌ (ఒరిజినల్ సిరీస్‌) – (మార్చి 4న రిలీజ్)

►సోని లివ్
* అన్‌ దేఖీ (హిందీ వెబ్‌ సిరీస్‌)-( మార్చి 4న రిలీజ్)