బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ (Bigg boss ott )లో మొదటి నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల వాదన మధ్య ఊహించని విధంగా జరిగింది. మొదటి వారం చాలెంజర్స్ టీంకి నామినేషన్ నుండి మినహాయింపు ఇచ్చాడు బిగ్ బాస్. ఓన్లీ వారియర్ టీం వాళ్ళనే నామినేట్ చేయాలని బిగ్బాస్ తెలపడంతో చాలెంజర్స్ పాత కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో సీజన్ ఫైవ్ లో వచ్చిన హమీద మొదటి వారం నామినేట్ అయింది.

ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనే కారణంతో బిందుమాధవి(Bindu madavi), హామీదని (Hamida )నామినేట్ చేసింది .అలాగే హామీద (Hamida )మీద నెగటివ్ వైబ్స్ ఉన్నాయని కారణం చెప్పి ఆర్ జె చైతు(RJ Chaitu ) కూడా ఆమెను నామినేట్ చేశాడు. సీజన్ ఫైవ్ లో లవ్ ట్రాక్ నడిపి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన హమీద(Hamida ) బిగ్ బాస్ ఓటిటి లో(Bigg Boss Ott ) మొదటి వారం ఎలిమినేషన్ లోకి వచ్చింది. మరి ఆమె హౌస్ లో కోనసాగుతుందా లేదా హౌస్ నుండి బయటకు వెళుతున్న అన్నది చూడాలి మరి.