పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan )మొదటిసారి నటిస్తున్న పిరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు(Hari hara veeramallu ) ఈ చిత్రంలో ఒక బందిపోటుగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) నటిస్తున్నారు .రాజరిక పాలన లో మగ్గిపోతున్న ప్రజల కష్టాలు తీర్చడానికి హరిహర వీరమల్లు ఎలాంటి పోరాటం చేశాడు అన్న కథాంశంతో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్(Nidhi agarwal ) నటిస్తోంది .ఇక విలక్షణ చిత్రాలు తీసే డైరెక్టర్ క్రిష్(Krish ) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మళ్లీ మొదలైంది .

ఇక ఈ సినిమాలో ఒక సెట్ కోసం దాదాపు పది కోట్లు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఢిల్లీలోని చాందిని చౌక్ సెట్ ని వేయబోతున్నారట.ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం .ఇక ఈ సినిమాలో విజువల్ గ్రాఫిక్స్ కూడా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది .ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఫస్ట్ లుక్ ఈ విశేష స్పందన వచ్చింది .త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి దసరా కానుకగా హరిహర వీరమల్లు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు చిత్ర యూనిట్.